కళయా? నిజమా!
ఇరవై తొమ్మిది సంవత్సరాల ఇంగ్లండ్ ఆర్టిస్ట్ ‘ఎమ్మా ఫె’ను ‘బాడీ పెయింటింగ్’ ఆర్టిస్ట్ అనడం కంటే... తన కుంచెతో మోడల్స్‌ను రకరకాల జంతువులుగా మార్చే మహా మాంత్రికురాలు అనడం సబబేమో! ఆమెకు కాన్వాస్‌తో పని లేదు. మనుషులే ఆమె కాన్వాస్. వాటిపై వాటర్ బేస్‌డ్ పెయింట్స్‌తో అద్భుతాలు సృష్టించి ‘ఆహా’ అనిపిస్తారు. ఇటీవల ఆమె ‘యూనియన్ ఆఫ్ యోగా’ పేరుతో చేసిన సిరీస్‌కు మంచి స్పందన లభించింది. యోగాలోని క్రమశిక్షణను కళాత్మకంగా వ్యక్తీకరించిన ప్రయత్నం ఇది. ఎమ్మా కళ ...‘ఆహా’ ‘వోహో’లకే పరిమితం కాదు. ఎంతో ఆలోచింపచేస్తుంది. మనకు జీవావరణానికి ఉన్న బంధాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.