నాపై ఇంత బడ్జెట్‌ అవసరమా అనిపించింది | “Winner gets positive censor report” | Sakshi
Sakshi News home page

నాపై ఇంత బడ్జెట్‌ అవసరమా అనిపించింది

Published Sun, Feb 19 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

నాపై ఇంత బడ్జెట్‌ అవసరమా అనిపించింది

నాపై ఇంత బడ్జెట్‌ అవసరమా అనిపించింది

‘విన్నర్‌’ కథ విన్న వెంటనే ఖర్చుతో కూడుకున్న సినిమా. నా మీద అంత బడ్జెట్‌ అవసరమా? అనుకున్నా. కానీ, నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టాలని ఆలోచించారు తప్ప హీరోకి మార్కెట్‌ గురించి ఆలోచించలేదు. వాళ్లు పెట్టిన ఖర్చుకి, గట్స్‌కి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించిన ‘విన్నర్‌’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు.

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘అవార్డులు, రివార్డులు వస్తుంటాయ్, పోతుంటాయ్‌. కానీ, ఓటమి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారన్నదే ఇంపార్టెంట్‌ అని కల్యాణ్‌గారు (పవన్‌ కల్యాణ్‌) చెప్పారు. ఈ రెండేళ్లు ఏం గెలుచుకున్నావంటే మెగా ఫ్యాన్స్‌ అభిమానం గెలుచుకున్నాను. నాకు గెలుపు, ఓటమిని పరిచయం చేసిన అమ్మా.. ‘లవ్‌ యూ’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంటే మాకు ఇష్టం. వాళ్ల అమ్మ అంటే తేజూకి చాలా ఇష్టం. తనలో నాకు నచ్చేది అదే. వాడికి అబద్ధం కూడా చెప్పడం రాదు . చిన్నప్పుడు నిజాలు చెప్పి తిట్లు తినేవాడు’’ అన్నారు.

గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ– ‘‘తేజూను మానిటర్‌లో చూస్తున్నప్పుడు చిరు, పవన్‌లను డైరెక్ట్‌ చేస్తున్నట్టనిపించింది. ఈ చిత్రంలో గుర్రంతో రిస్కీ షాట్స్‌ చేశాడు. రెండు మూడుసార్లు పడ్డాడు. నటుడిగా ఈ చిత్రంతో తను నెక్ట్స్‌ లెవల్‌కి వెళతాడు. టాలీవుడ్‌లో అనుష్క తర్వాత అంత డెడికేషన్‌ రకుల్‌లో చూశా’’ అన్నారు.  ‘‘నేను, తేజు క్రికెట్‌ ఆడుతుంటాం. ధోనీ ఫస్ట్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. మా ఫస్ట్‌ మూవీ డకౌట్‌ అయ్యింది. ఈ ‘విన్నర్‌’ మాత్రం పెద్ద హిట్‌ అవుతుంది. తేజుకి మ్యూజిక్‌ చేసేటప్పుడు మెగాస్టార్, పవర్‌స్టార్, సై్టలిష్‌ స్టార్‌ గుర్తుకొస్తారు నాకు’’ అని  సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు.

నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, పీవీపీ, ‘జెమినీ’ కిరణ్, రాజీవ్‌ రెడ్డి, దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్‌ రెడ్డి, మెహర్‌ రమేశ్, బాబీ, అనిల్‌ రావిపూడి, బీవీఎస్‌ రవి, సంకల్ప్,  కెమేరామ్యాన్‌ ఛోటా కె.నాయుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్‌ అనసూయ, ఎడిటర్‌ గౌతంరాజు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement