pre-release function
-
వర్చువల్ రియాల్టీలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్!
ట్రెయిలర్‌తోనే రికార్డులు సృష్టించిన మెగా మూవీ ‘బాహుబలి–2’ మరో సంచలనానికి తెరతీస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఈ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్ టెక్నాలజీస్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేసింది. ‘బాహుబలి–2’ నిర్మాణ సమయంలో ఈ సంస్థ రెండు వర్చువల్ రియాల్టీ బిట్లను అభివృద్ధి చేసింది. ‘బీబీ360సీసీ’ పేరుతో అభివృద్ధి చేసిన 32 కెమెరాలున్న సూపర్ వీఆర్ క్యాప్చరింగ్ కెమేరాతో వీటిని చిత్రీకరించింది. ఈ 32 కెమేరాల్లోని దృశ్యాలను సీన్‌గా మార్చేందుకు లూమ్ పేరుతో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేశారు. ఒకవైపు షూటింగ్ జరుగుతూండగానే.. మరోవైపు ఈ సాఫ్ట్వేర్ వర్చువల్ రియాల్టీ సీన్స్‌ను సిద్ధం చేస్తూంటుంది. ఇలా చిత్రీకరించిన సీన్స్‌ను వీఆర్ హెడ్‌సెట్‌తో చూసినప్పుడు.. ప్రేక్షకుడికి తాను సన్నివేశం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ చేసే యుద్ధ విన్యాసాలు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), బీబీ360సీసీ కెమేరా, లూమ్ సాఫ్ట్వేర్లను కలిపి ఉపయోగించడం ద్వారా అత్యద్భుతమైన నాణ్యతతో వర్చువల్ రియాల్టీ సన్నివేశాలను సిద్ధం చేయవచ్చునని ఏఎండీ అంటోంది. పైగా.. లూమ్ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినందున.. దీన్ని ఎవరైనా వాడుకునే వీలుంటుందని సంస్థ ఉన్నతాధికారి రాజా కోడూరి తెలిపారు. ‘బాహుబలి’ కోసం తాము వీఆర్‌లో రెండు సీన్స్ సిద్ధం చేశామని, దీంట్లో ఒకటి బాహుబలి సెట్స్‌కు సంబంధించినది కాగా, రెండోది ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ అని ఆయన చెప్పారు. బాహుబలి సెట్స్ తాలూకు వీఆర్ క్లిప్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రత్యేకమైన పాడ్స్లలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించనున్నారు. -
‘విన్నర్’ ప్రీ రిలీజ్
-
నాపై ఇంత బడ్జెట్ అవసరమా అనిపించింది
‘విన్నర్’ కథ విన్న వెంటనే ఖర్చుతో కూడుకున్న సినిమా. నా మీద అంత బడ్జెట్ అవసరమా? అనుకున్నా. కానీ, నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టాలని ఆలోచించారు తప్ప హీరోకి మార్కెట్ గురించి ఆలోచించలేదు. వాళ్లు పెట్టిన ఖర్చుకి, గట్స్‌కి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘విన్నర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అవార్డులు, రివార్డులు వస్తుంటాయ్, పోతుంటాయ్. కానీ, ఓటమి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారన్నదే ఇంపార్టెంట్ అని కల్యాణ్‌గారు (పవన్ కల్యాణ్) చెప్పారు. ఈ రెండేళ్లు ఏం గెలుచుకున్నావంటే మెగా ఫ్యాన్స్ అభిమానం గెలుచుకున్నాను. నాకు గెలుపు, ఓటమిని పరిచయం చేసిన అమ్మా.. ‘లవ్ యూ’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంటే మాకు ఇష్టం. వాళ్ల అమ్మ అంటే తేజూకి చాలా ఇష్టం. తనలో నాకు నచ్చేది అదే. వాడికి అబద్ధం కూడా చెప్పడం రాదు . చిన్నప్పుడు నిజాలు చెప్పి తిట్లు తినేవాడు’’ అన్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘తేజూను మానిటర్లో చూస్తున్నప్పుడు చిరు, పవన్‌లను డైరెక్ట్ చేస్తున్నట్టనిపించింది. ఈ చిత్రంలో గుర్రంతో రిస్కీ షాట్స్ చేశాడు. రెండు మూడుసార్లు పడ్డాడు. నటుడిగా ఈ చిత్రంతో తను నెక్ట్స్ లెవల్‌కి వెళతాడు. టాలీవుడ్లో అనుష్క తర్వాత అంత డెడికేషన్ రకుల్‌లో చూశా’’ అన్నారు. ‘‘నేను, తేజు క్రికెట్ ఆడుతుంటాం. ధోనీ ఫస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మా ఫస్ట్ మూవీ డకౌట్ అయ్యింది. ఈ ‘విన్నర్’ మాత్రం పెద్ద హిట్ అవుతుంది. తేజుకి మ్యూజిక్ చేసేటప్పుడు మెగాస్టార్, పవర్‌స్టార్, సై్టలిష్ స్టార్ గుర్తుకొస్తారు నాకు’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, పీవీపీ, ‘జెమినీ’ కిరణ్, రాజీవ్ రెడ్డి, దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, మెహర్ రమేశ్, బాబీ, అనిల్ రావిపూడి, బీవీఎస్ రవి, సంకల్ప్, కెమేరామ్యాన్ ఛోటా కె.నాయుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్ అనసూయ, ఎడిటర్ గౌతంరాజు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
బాక్సాఫీస్ పాలిటిక్స్
-
అమ్మడూ...ఇక కుమ్ముడే!
చిరంజీవి స్టెప్పులు, డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?! స్టార్ నుంచి మెగాస్టార్ కావడంలో ఆయన యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులకు క్రెడిట్ దక్కుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మరి, రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లోనూ మునుపటిలా స్టెప్పులు వేస్తారా అనడిగితే... సందేహాలు అవసరం లేదంటున్నారు దర్శకుడు వీవీ వినాయక్. శాంపిల్‌గా ఈరోజు సాయంత్రం ‘అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు’ అనే సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడీ ‘ఖైదీ నంబర్ 150’కి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలను ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మించారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.