మలాగా (స్పెయిన్): డేవిస్ కప్‌లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్‌లో వరల్డ్ కప్‌లాంటి డేవిస్ కప్‌లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్‌పై విజయం సాధించాడు.
2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్‌ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్‌లు కొట్టాడు. సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్‌ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు.
Comments
Please login to add a commentAdd a comment