Max Verstappen Wins Belgian Grand Prix Sprint Race - Sakshi
Sakshi News home page

Belgian Grand Prix: బెల్జియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ విజేత మాక్స్‌ వెర్‌స్టాపెన్‌

Published Sun, Jul 30 2023 1:28 PM | Last Updated on Sun, Jul 30 2023 2:32 PM

Max Verstappen Wins Belgian Grand Prix Sprint Race - Sakshi

స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్‌ (బెల్జియం): గత వారం హంగేరియన్‌ గ్రాండ్‌ప్రిలో పోల్‌ పొజిషన్‌ సాధించడంలో విఫలమైన మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ శనివారం బెల్జియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఈ సారి మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శనివారం జరిగిన బెల్జియన్‌ గ్రాండ్‌ ప్రి క్వాలిఫయింగ్‌ రేసులో అగ్ర స్థానంలో నిలిచిన అతను 0.011 సెకన్ల తేడాతో పోల్‌ పొజిషన్‌ను సాధించాడు.

ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 49.056 సెకన్లలో వెర్‌స్టాపెన్‌ పూర్తి చేశాడు. మెక్లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రీ (1 నిమిషం 49.067 సె.) రెండో స్థానంలో నిలవగా, కార్లోస్‌ సెయిన్జ్‌ (ఫెరారీ – 1 నిమిష 49.081 సె.)కు మూడో స్థానం దక్కింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement