Belgian Grand Prix
-
బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత మాక్స్ వెర్స్టాపెన్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): గత వారం హంగేరియన్ గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమైన మ్యాక్స్ వెర్స్టాపెన్ శనివారం బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఈ సారి మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శనివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ రేసులో అగ్ర స్థానంలో నిలిచిన అతను 0.011 సెకన్ల తేడాతో పోల్ పొజిషన్‌ను సాధించాడు. ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 49.056 సెకన్లలో వెర్స్టాపెన్ పూర్తి చేశాడు. మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రీ (1 నిమిషం 49.067 సె.) రెండో స్థానంలో నిలవగా, కార్లోస్ సెయిన్జ్ (ఫెరారీ – 1 నిమిష 49.081 సె.)కు మూడో స్థానం దక్కింది. -
హామిల్టన్‌కే టైటిల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. ఒకే రేసులో ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్లు టాప్–2లో ఉండటం ఇది 50వసారి కావడం విశేషం. ఏడు రేసులు ముగిసిన ఈ సీజన్లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 157 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. బెల్జియం గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌ), 5. ఒకాన్ (రెనౌ), 6. అల్బోన్ (రెడ్‌బుల్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. గాస్లీ (అల్ఫా టౌరి), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్). -
లెక్లెర్క్కు పోల్ పొజిషన్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న ఫెరారీ జట్టుకు మరో అవకాశం లభించింది. ఆ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ సీజన్లో మూడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 21 ఏళ్ల లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.519 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీకే చెందిన సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో గ్రిడ్‌లోని తొలి రెండు స్థానాలు ఫెరారీకి లభించడం తొలిసారి. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, బొటాస్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో, బొటాస్, మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండేసి రేసుల్లో విజేతగా నిలిచారు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఆస్ట్రియా గ్రాండ్ప్రిలలోనూ లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. అయితే ప్రధాన రేసులో అతను మూడో స్థానంలో (బహ్రెయిన్), రెండో స్థానంలో (ఆస్ట్రియా) నిలిచాడు. మూడో ప్రయత్నంలో అతను టైటిల్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి. -
రోస్‌బర్గ్ ‘ఏడోసారి’
- ఈ సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్‌కు ఏడో పోల్ - హామిల్టన్‌కు రెండో స్థానం - నేడు బెల్జియన్ గ్రాండ్ ప్రి స్పా (బెల్జియం): ఫార్ములావన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఇది అతడికి వరుసగా నాలుగో పోల్ పొజిషన్ కావడం విశేషం. శనివారం అర్డెన్నెస్ ఫారెస్ట్‌లోని స్పా-ఫ్రాంకోర్చాంప్స్ సర్క్యూట్‌పై జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో అతను అందరికంటే వేగంగా 2 నిమిషాల 5.698 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. వర్షం మధ్య సాగిన క్వాలిఫయింగ్‌లో మెర్సిడెస్ మరో డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (2 నిమిషాల 5.819 సెకన్లు) చివరి వరకు గట్టిపోటి ఇచ్చాడు. అయితే కారులో బ్రేక్ సమస్యలు రావడంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. జూన్‌లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి తర్వాత మళ్లీ మెర్సిడెజ్ డ్రైవర్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం ఇదే మొదటిసారి. బెల్జియన్ గ్రాండ్ ప్రి డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్, అలోన్సో, రికియార్డో తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు. నిరాశపర్చిన ‘ఫోర్స్’ క్వాలిఫయింగ్ సెషన్లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నిరాశపర్చారు. ఈ సీజన్లో హుల్కెన్‌బర్గ్ తొలిసారి క్వాలిఫయింగ్ తొలి దశలోనే వెనుదిరిగాడు. అయితే మరో డ్రైవర్ పెరెజ్.. క్యూ-2లో 2 నిమిషాల 10.084 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేయడంతో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు.