చరిత్ర సృష్టించిన పోర్చుగల్
పారిస్: యూరో కప్లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు. స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో గాయంతో ఫస్ట్ ఆఫ్లోనే మైదానాన్ని వీడినా పోర్చుగల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడింది. యూరోకప్ విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
2004 యూరోకప్లో ఆతిథ్య జట్టుగా ఫైనల్కు చేరిన పోర్చుగల్.. 1-0 గోల్స్ తేడాతో గ్రీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ను అదే స్కోరుతో ఓడించి పోర్చుగల్ యూరోకప్ కలను నెరవేర్చుకోవటం విశేషం.