మెగా మేనల్లుడు మాట తప్పుతున్నాడు..? | Sai Dharam Tej to remix Chiranjeevis Best Song | Sakshi
Sakshi News home page

మెగా మేనల్లుడు మాట తప్పుతున్నాడు..?

Published Fri, Mar 3 2017 4:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

మెగా మేనల్లుడు మాట తప్పుతున్నాడు..?

మెగా మేనల్లుడు మాట తప్పుతున్నాడు..?

వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లను ఇమిటేట్ చేసే సాయి.. మెగాస్టార్ పాత పాటలను రీమిక్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే గోలిమార్, గువ్వా గోరింకతో, అందం హిందోళం పాటలను రీమిక్స్ చేసిన సాయి ధరమ్.. ఆ తరువాత ఇక రీమిక్స్లు చేయనంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

కానీ సాయి వాలకం చూస్తుంటే అలా కనిపించటం లేదు. గురువారం ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు గెస్ట్గా వచ్చిన సాయిధరమ్, తన మనసులోని మాటను బయటపెట్టాడు. చిరు కెరీర్ లోనే బెస్ట్ మెలోడీ అన్న పేరున్న 'మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు' పాటను రీమిక్స్ చేయాలనుందంటూ మెగాస్టార్ ముందే ఓపెన్ అయ్యాడు. మరి రీమిక్స్లకు గుడ్ బై చెప్పానంటూ ప్రకటించిన సాయి మాట తప్పుతాడా..? మళ్లీ రీమిక్స్ చేస్తాడా..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement