
మెగా హీరో కోసం మహేష్
టాలీవుడ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టేసి కలిసి పోతున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలు ఒకరి సినిమా ఓపెనింగ్లకు ఒకరు హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించటంతో పాటు పాటలను కూడా తన సోషల్ మీడియా పేజ్లలో ప్రమోట్ చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు.
అదే బాటలో ఒక మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేయనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా విన్నర్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమన్ అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఒక పాటను మహేష్ తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న మహేష్ బాబు. షూటింగ్ లోకేషన్ నుంచే ఈ రోజు (బుధవారం) సితార అనే విన్నర్ తొలి పాటను రిలీజ్ చేయనున్నాడు. సితార.. మహేష్ కూతురి పేరు కావటంతో మహేష్ చేతులు మీదుగా ఆ పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
#Winner #Thankyousuperstar pic.twitter.com/BK0mCE5RTy
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 1 February 2017
Super thanks to Our #superstar @urstrulyMahesh for his Super heart ❤️ to launch our #sitarasong today at #7pm from @IamSaiDharamTej #winner pic.twitter.com/hOPuNKSkCn
— thaman ss (@MusicThaman) 1 February 2017