క్రికెట్ విజేత కర్నూలు
Published Mon, Aug 29 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో గత నాలుగురోజులుగా నిర్వహిస్తున్న ముండ్ల చంద్రశేఖరరెడ్డి స్మారక సౌత్‌జోన్ అంతర్ జిల్లాల మహిళా క్రికెట్ పోటీల విజేతగా కర్నూలు జట్టు నిలిచింది. విజేతలకు ముండ్ల చంద్రశేఖరరెడ్డి సతీమణి అరుంధతమ్మ, ఆయన మనుమడు ముండ్ల అక్షయ్‌రెడ్డి ట్రోఫీలను అందజేశారు. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జట్టులోని హరిప్రసన్న 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 14 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసి విజయం సాధించింది.
Advertisement
Advertisement