
హాప్‌మన్ కప్ విజేత ఆస్ట్రేలియా
ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా 17 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించింది.
ఫైనల్లో ఉక్రెయిన్‌పై విజయం
పెర్త్: ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా 17 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 2-0తో ఉక్రెయిన్‌ను ఓడించింది. పురుషులు, మహిళలు కలిపి ఆడే ఈ టీమ్ ఈవెంట్‌లో చివరిసారి 1999లో కంగారూలు నెగ్గారు. ఉక్రెయిన్‌తో ఫైనల్లో తొలుత మహిళల సింగిల్స్‌లో గావ్రిలోవా 6-4, 7-6 (8/6)తో స్విటోలినాపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిరియోస్ 6-3, 6-4తో డొల్గోపొలోవ్‌పై గెలిచి 2-0తో జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఫలితం రావడంతో మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ నిర్వహించలేదు. 2003 తర్వాత ఆస్ట్రేలియా ఈ టోర్నీ ఫైనల్‌కు చేరడం కూడా ఇదే తొలిసారి.