ఆల్‌రౌండ్ విజేత అనంత
Published Mon, Dec 19 2016 12:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 జూడో అమ్మాయిల విభాగంలో ఆల్‌రౌండ్ విజేతగా అనంత జట్టు నిలిచింది. ఆదివారం నగరంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో జరిగిన పోటీల్లో అన్ని విభాగాలలోను అనంత క్రీడాకారిణులు విజేతలుగా నిలిచి తమ సత్తా చాటారు. వ్యక్తిగత విభాగాలలో తృతీయ బహుమతిని ఇద్దరు క్రీడాకారులకు కేటాయించారు. అండర్–19 రాష్ట్రస్థాయి జూడో క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారంతో ముగుస్తాయని అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డీటీ స్పోర్‌్ట్స డైరెక్టర్ నిర్మల్‌కుమార్, శాంతరాజ్, నాగేంద్రమ్మ, వెంకటనామిశెట్టి, రాఘవేంద్రరావు, వెంకటప్ప పాల్గొన్నారు.
విజేతల వివరాలు..
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు వరుసగా
36 కేజీల విభాగం
వనజ(అనంతపురం), మాధురి(తూర్పుగోదావరి).
40 కేజీల విభాగం
జ్యోతి(విశాఖపట్టణం), అపర్ణ(తూర్పుగోదావరి), అనూష(చిత్తూరు).
44 కేజీల విభాగం
కౌసల్య (అనంతపురం), విజయభారతి (తూర్పుగోదావరి), జానకి(చిత్తూరు).
48 కేజీల విభాగం
ప్రియాంక (అనంతపురం), తేజశ్రీ (చిత్తూరు), సుగుణ (తూర్పుగోదావరి).
52 కేజీల విభాగం
కావ్య (అనంతపురం), జోహారికరెడ్డి (చిత్తూరు), అరుణ (తూర్పుగోదావరి).
56 కేజీల విభాగం
విజయదుర్గ (తూర్పుగోదావరి), సంధ్యాబాయి(అనంతపురం), నేతాశ్రీ (కృష్ణా).
61 కేజీల విభాగం
గౌతమి (అనంతపురం), జ్యోతిమౌనిక (తూర్పుగోదావరి), భార్గవి (చిత్తూరు), నిహారిక (విశాఖపట్టణం).
61 కేజీల పైబడిన విభాగం
సుచిత్ర (అనంతపురం), తేజశ్విణి (చిత్తూరు), సంతోషికుమారి (తూర్పుగోదావరి).
Advertisement