all-around
-
ఆల్‌రౌండ్ విజేత అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 జూడో అమ్మాయిల విభాగంలో ఆల్‌రౌండ్ విజేతగా అనంత జట్టు నిలిచింది. ఆదివారం నగరంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో జరిగిన పోటీల్లో అన్ని విభాగాలలోను అనంత క్రీడాకారిణులు విజేతలుగా నిలిచి తమ సత్తా చాటారు. వ్యక్తిగత విభాగాలలో తృతీయ బహుమతిని ఇద్దరు క్రీడాకారులకు కేటాయించారు. అండర్–19 రాష్ట్రస్థాయి జూడో క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారిణులకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారంతో ముగుస్తాయని అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్‌్ట్స డైరెక్టర్ నిర్మల్‌కుమార్, శాంతరాజ్, నాగేంద్రమ్మ, వెంకటనామిశెట్టి, రాఘవేంద్రరావు, వెంకటప్ప పాల్గొన్నారు. విజేతల వివరాలు.. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారు వరుసగా 36 కేజీల విభాగం వనజ(అనంతపురం), మాధురి(తూర్పుగోదావరి). 40 కేజీల విభాగం జ్యోతి(విశాఖపట్టణం), అపర్ణ(తూర్పుగోదావరి), అనూష(చిత్తూరు). 44 కేజీల విభాగం కౌసల్య (అనంతపురం), విజయభారతి (తూర్పుగోదావరి), జానకి(చిత్తూరు). 48 కేజీల విభాగం ప్రియాంక (అనంతపురం), తేజశ్రీ (చిత్తూరు), సుగుణ (తూర్పుగోదావరి). 52 కేజీల విభాగం కావ్య (అనంతపురం), జోహారికరెడ్డి (చిత్తూరు), అరుణ (తూర్పుగోదావరి). 56 కేజీల విభాగం విజయదుర్గ (తూర్పుగోదావరి), సంధ్యాబాయి(అనంతపురం), నేతాశ్రీ (కృష్ణా). 61 కేజీల విభాగం గౌతమి (అనంతపురం), జ్యోతిమౌనిక (తూర్పుగోదావరి), భార్గవి (చిత్తూరు), నిహారిక (విశాఖపట్టణం). 61 కేజీల పైబడిన విభాగం సుచిత్ర (అనంతపురం), తేజశ్విణి (చిత్తూరు), సంతోషికుమారి (తూర్పుగోదావరి). -
శివకుమార్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: శివకుమార్ (సెంచరీ, 6 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గ్రీన్లాండ్స్ జట్టు 253 పరుగుల తేడాతో ఇంపీరియల్ జట్టుపై భారీ విజయాన్ని సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గ్రీన్లాండ్స్ 50 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీస్కోరు చేసింది. శివకుమార్ (93 బంతుల్లో 115, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. నూతన్ కళ్యాణ్ రెడ్డి (96), రోహిత్ రెడ్డి (73), సాత్విక్ (55) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంపీరియల్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేయగల్గింది. మహేందర్ 27 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ శివకుమార్ (6/13) చెలరేగాడు. ఇంపీరియల్ కోల్పోయిన 8 వికెట్లలో 6 వికెట్లను అతనే పడగొట్టడం విశేషం. మిగతా రెండు వికెట్లను నిఖిల్ తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు స్వస్తిక్ యూనియన్: 66 (కరుణాకర్ 20; రోహన్ బోరంచ 8/16, బాలరాజు 1/15), టైమ్ సీసీ: 69/2 (సీతారామిరెడ్డి 46; రాహుల్ 1/14) ఎల్‌ఎన్‌సీసీ: 269/9 (యాసిన్ 76, రవూఫ్ 71; చైతన్యకృష్ణ 4/70, మహ్మద్ అలీ 3/54, శ్రీధర్‌రాజు 2/30), ఆజాద్: 97 (సందీప్ 57; యాసిన్ 5/30, తరుణ్ 4/32, సందీప్ 1/5) హెచ్‌యూసీసీ: 198 (ఆరిఫ్ 59, సయ్యద్ అహ్మద్ 46, అబ్దుల్ మొఖిత్ 34 నాటౌట్; సమీయుద్దీన్ 5/24, షేక్ నజీర్ 3/42), రుషిరాజ్: 162 (జీషాన్ 45; అబ్దుల్ మొఖిత్ 4/31, షణ్ముఖ్ 3/22) యాదవ్ డెయిరీ: 269/9 (సిద్ధార్థ 56, సాయిచరణ్ 39; దీపక్ 2/28, విజేందర్ 2/59), సాయి నాటౌట్ 48, రాజ్ 45; రిషబ్ 5/79, విష్ణు 2/31).