IPL 2023: Ravindra Jadeja Says Crowd In Stadium Chants For Dhoni And Will Wait For My Exit - Sakshi
Sakshi News home page

#MS Dhoni: నేను బ్యాటింగ్‌కు రాగానే వారికి నిరాశ! వీడెప్పుడెప్పుడు అవుట్‌ అవుతాడా అంటూ..

Published Thu, May 11 2023 11:21 AM | Last Updated on Thu, May 11 2023 11:53 AM

IPL 2023 Crowd Chants For Dhoni Wait For Me To Get Out: Ravindra Jadeja - Sakshi

మహేంద్ర సింగ్‌ ధోని (PC: IPL/CSK Twitter)

IPL 2023- CSK Vs DC: మహేంద్ర సింగ్‌ ధోని.. ఆ పేరే ఓ పవర్‌హౌజ్‌. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించడంతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ మిస్టర్‌ కూల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని క్రీజులో ఉంటే చాలు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోతారు. 

ఒక్క షాట్‌ కొట్టినా చాలు
తనదైన శైలిలో ఒక్క షాట్‌ కొట్టినా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక ఐపీఎల్‌-2023 ధోనికి చివరి సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో సీఎస్‌కే ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ.. స్టేడియం ఏదైనా ధోని నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. మ్యాచ్‌ చెన్నైలోనా లేదంటే ప్రత్యర్థి సొంతమైదానంలోనా అన్న తేడా లేకుండా పసుపు వర్ణంతో స్టేడియం నిండిపోతోంది.

ఎక్కడ చూసినా ధోని నామస్మరణే
ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇటీవల ధోనికి మద్దతుగా వేలాది మంది తరలిరావడం ఇందుకు ఓ ఉదాహరణ. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకున్నా తన పేరును జపిస్తున్న ఫ్యాన్స్‌ కోసం ప్యాడ్స్‌ కట్టుకుని సమాయత్తమవుతున్నట్లు నటించి వారిని కాసేపు మురిపించాడు ధోని. అలాంటిది చెపాక్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే.. ఊరుకుంటాడా?!

యాడ్‌ కూడా వేయలేదు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడు అవుట్‌ కాగానే క్రీజులోకి వచ్చిన ధోని.. 9 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్స్‌ల సాయంతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఖుషీ చేశాడు. ఇక ధోని క్రేజ్‌ దృష్ట్యా బ్రాడ్‌కాస్టర్‌ యాడ్‌ కూడా వేయకుండా అతడు మైదానంలో అడుగుపెడుతున్న దృశ్యాలను చూపించిందంటే తలా క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎప్పుడు అవుట్‌ అవుతానా అని ఎదురుచూశారు!
ఈ నేపథ్యంలో సీఎస్‌కే ప్రధాన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏడో స్థానంలో నేను బ్యాటింగ్‌కు రాగానే ప్రేక్షకులు నిరాశ చెందారు. మహీ భాయ్‌ నామస్మరణ మొదలుపెట్టారు. ఒకవేళ నేను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. వీడు ఎప్పుడెప్పుడు అవుట్‌ అవుతాడా అని వేచి చూసేవారేమో!’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. 

జడ్డూ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో
ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అదే విధంగా 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఒక వికెట్‌ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ స్కోరర్‌ రిలీ రొసోవ్‌(35) రూపంలో కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ధోని క్రేజ్‌ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: అతడిని బాగా మిస్‌ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని
అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement