సీఎస్‌కే విజయానంతరం జడ్డూను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్ (PC: IPL)
Ravindra Jadeja- MS Dhoni: ‘‘అతడు బ్యాటింగ్ చేయడానికి వెళ్లే సమయానికి దాదాపు 5-10 బంతులో మిగిలి ఉన్న సమయంలో.. కొన్నిసార్లు షాట్లు ఆడగలడు. లేదంటే మిస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, తన తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుందని తనకు తెలుసు.
కాబట్టి ఒక్కోసారి తనకు రెండు- మూడు బంతులు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ధోని మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకులు అతడి నామస్మరణ మొదలుపెట్టడం సహజం. అంతేగాక ధోని రాక కోసం ఒక్కోసారి జడేజా తొందరగా అవుట్ కావాలని కోరుకుంటారు కూడా!
బహుశా ఈ విషయం జడేజా మనసును గాయపరిచి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏ ఆటగాడైనా అలాగే ఫీల్ అవుతాడు. ఒత్తిడిలో కూరుకుపోతాడు. కానీ ఈ విషయం గురించి ఒక్కసారి కూడా అతడు మాకు కంప్లైంట్ చేయలేదు. తను ఆ ట్వీట్ చేసినప్పటికీ ఆ విషయం గురించి మా దగ్గర ప్రస్తావించలేదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు.
ధోనిపై ప్రేమ.. జడ్డూ మనసుకు గాయం
సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో అభిమానుల ప్రేమ.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కొన్నిసార్లు బాధపెట్టిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో ఎక్కడ చూసినా ధోని నామస్మరణే సాగింది. చెన్నై సొంతమైదానం అనే కాకుండా ఇతర స్టేడియాల్లో కూడా సీఎస్‌కే మ్యాచ్ ఉందంటే ధోని పేరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
జడ్డూ ట్వీట్‌పై అభిమానుల ఆగ్రహం
ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో జడ్డూ తర్వాత ధోని ఎంట్రీ ఇచ్చే నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక్కోసారి.. జడేజాను తొందరగా అవుట్ అవ్వాలంటూ కామెంట్లు చేశారు. ధోని మీద వారికున్న ప్రేమ.. జడేజాకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో మనసు చిన్నబుచ్చుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. జట్టును గెలిపించి అవార్డు అందుకున్న సందర్భంలో.. ‘‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో ఇప్పటికైనా తెలిసిందా?’’అన్న అర్థంలో ట్వీట్ చేశాడు.
దీంతో జడేజాపై సీఎస్‌కే అభిమానులు కూడా విరుచుకుపడ్డారు. ధోని మీద ఆప్యాయత చూపినంత మాత్రాన నిన్ను తక్కువ చేసినట్లు కాదని.. అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావంటూ చివాట్లు పెట్టారు. ధోనిని అవమానించావంటూ మండిపడ్డారు.
ఫైనల్లో బౌండరీ బాది
అయితే, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బౌండరీ బాది జడేజా.. సీఎస్‌కేను విజయతీరాలకు చేర్చిన తర్వాత ధోని భయ్యా కోసం ఏదైనా చేస్తా అంటూ అతడు చేసిన ట్వీట్ అభిమానుల కోపాన్ని చల్లార్చింది. నిజంగానే జడ్డూకు ధోని అంటే ఎంత ప్రేమో అని ఫ్యాన్స్ మురిసిపోయారు.
ఈ నేపథ్యంలో జడేజా క్రిప్టిక్ పోస్ట్‌పై తాజాగా స్పందించిన కాశీ విశ్వనాథన్ ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. జడ్డూ స్థానంలో ఎవరున్నా హర్ట్ అవడం సహజమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన ధోని సారథ్యంలోని సీఎస్‌కే ఐదోసారి ట్రోఫీ గెలిచింది.
చదవండి: Ind Vs WI: విండీస్‌కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్!
ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
M.O.O.D! 🤗
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd
Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
Comments
Please login to add a commentAdd a comment