సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ..
‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు.
చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..
‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు.
చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల
Comments
Please login to add a commentAdd a comment