రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న క్రికెటర్‌  | Ambati Rayudu Comments On Retirement | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న రాయుడు 

Published Fri, Aug 30 2019 6:45 AM | Last Updated on Fri, Aug 30 2019 8:56 AM

Ambati Rayudu Comments On Retirement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు. హెచ్‌సీఏ వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement