రనౌట్‌ విషయంలో రాయుడు చెత్త రికార్డు | Ambati Rayudu Worst Record 15 Times Run Out In IPL History | Sakshi
Sakshi News home page

Ambati Rayudu: రనౌట్‌ విషయంలో రాయుడు చెత్త రికార్డు

Published Sat, Mar 26 2022 8:53 PM | Last Updated on Sat, Mar 26 2022 9:00 PM

Ambati Rayudu Worst Record 15 Times Run Out In IPL History - Sakshi

Courtesy: IPL Twitter

సీఎస్‌కే ఆటగాడు అంబటి రాయుడు రనౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఇంతలో సమన్వయలోపంతో రాయుడు సగం క్రీజు దాటి వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న శ్రేయాస్‌ అయ్యర్‌ మెరుపు వేగంతో ‍త్రో విసిరాడు. రాయుడు క్రీజులోకి చేరుకునేలోపే నరైన్‌ బెయిల్స్‌ ఎగురగొట్టాడు. దీంతో రాయుడు నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

ఈ క్రమంలో రాయుడు ఒక చెత్త రికార్డు సాధించాడు. ఇప్పటివరకు రాయుడు తాజా దానితో కలిపి 15 సార్లు రనౌట్‌ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు రనౌట్‌ అయిన ఆటగాళ్లలో సురేశ్‌ రైనాతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 16 సార్లు రనౌట్‌తో ధావన్‌, గంభీర్‌లు తొలి స్థానంలో ఉన్నారు. ఇక ఏబీ డివిలియర్స్‌ 14 సార్లు రనౌట్‌ అయి మూడో స్థానంలో ఉన్నాడు.

రాయుడు రనౌట్‌ ఇక్కడ కోసం క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement