Breadcrumb
IPL 2022: సీఎస్కేపై కేకేఆర్ ఘన విజయం
Published Sat, Mar 26 2022 7:03 PM | Last Updated on Sat, Mar 26 2022 11:29 PM
Live Updates
IPL 2022: సీఎస్కేపై కేకేఆర్ ఘన విజయం
సీఎస్కేపై ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్
ఐపీఎల్ల 2022 సీజన్లో కేకేఆర్ శుభారంభం చేసింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ బిల్లింగ్స్ 25, శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. సీఎస్కే బౌలర్లలో డ్వేన్ బ్రేవో 3, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ తీశాడు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 11 ఓవర్లలో 83/2
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులతో నిలకడగా ఆడుతున్న నితీష్ రాణా బ్రేవో బౌలింగ్‌ళో రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కేకేఆర్ 10 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రహానే 41, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
వెంకటేశ్ అయ్యర్(16) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. డ్వేన్ బ్రేవో బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. రహానే 27, నితీష్ రాణా 1 పరుగుతో ఆడుతున్నారు.
టార్గెట్ 132.. దూకుడుగా ఆడుతున్న కేకేఆర్
132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. రహానే 22, వెంకటేశ్ అయ్యర్ 13 పరుగులతో ఆడుతున్నారు.
ధోని దనాధన్ ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ 132
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ధోని ధనాధన్ ఇన్నింగ్స్‌తో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న ష్టానికి 131 పరుగులు చేసింది. ధోని(38 బంతుల్లో 50 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు, ఒక సిక్సర్) తనదైన ఆటను చూపించాడు. ఒక దశలో వంద పరుగులు చేయడం కష్టమని భావించిన వేళ ధోని మెరుపు ఇన్నింగ్స్‌తో సీఎస్కే కోలుకుంది. కెప్టెన్ జడేజా 26 పరుగులు నాటౌట్ రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ తీశారు.
14 ఓవర్లలో సీఎస్కే 69/5
14 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. జడేజా 11, ధోని 5 పరుగులుతో క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే
సీఎస్కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా 3 పరుగులు చేసిన దూబే రసెల్ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. జడేజా (8) , ధోని క్రీజులో ఉన్నారు.
రాయుడు రనౌట్.. నాలుగో వికెట్ డౌన్
సీఎస్కేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జడేజాతో సమన్వయ లోపం కారణంగా రాయుడు రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 8.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది.
షెల్డన్ జాక్సన్ మెరుపు వేగం.. మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే
దాటిగా ఆడుతున్న రాబిన్ ఊతప్ప(28 పరుగులు) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. బంతి వైడ్ వెళ్లినప్పటికి.. షెల్డన్ జాక్సన్ సూపర్ మెరుపు వేగంతో బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం సీఎస్కే 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే
డెవన్ కాన్వే(3) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఊతప్ప 22, అంబటి రాయుడు 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
మూడు ఓవర్లకు స్కోర్ 16/1
ఉతప్ప 11 పరుగులు, కాన్వే 5 బంతుల్లో 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఓవర్లోనే సీఎస్కేకు షాక్.
సీఎస్కే ఇన్నింగ్ ప్రారంభించిన తొలి ఓవర్లోనే కేకేఆర్‌కు వికెట్ దక్కింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(0) డకౌట్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో నితిశ్ రాణాకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ పెవిలియన్ బాట పట్టాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంస్ ధోని (వికెట్), డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, తుషార్దేశ్ పాండే, మిచెల్ సాంట్నర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
😍😍#TATAIPL #CSKvKKR pic.twitter.com/x01QvlpNce
— IndianPremierLeague (@IPL) March 26, 2022
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఐపీఎల్-2022కు తెరలేచింది. తొలి మ్యాచ్ ఢిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుని అందరిని షాక్ గురిచేశాడు. ధోని స్థానంలో రవీంద్ర జడేజా నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇరు జట్లు కూడా ఈ ఏడాది సీజన్లో సరికొత్తగా కన్పిస్తున్నాయి. ఈ రెండు టీంల మధ్య 26 మ్యాచ్‌లు జరగగా, చెన్నై 17 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా కేవలం 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
కేకేఆర్ కెప్టెన్‌గా భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్ మెగా వేలంలో ఇరు జట్లు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ తొలి పోరుకు ముందు ఇరు జట్లు బలాబలాలను ఓ సారి పరీశీలిద్దాం. తొలి మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ దూరం కానున్నాడు. అదే విధంగా స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయపడటం సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ పరంగా చెన్నై పటిష్టంగా కన్పిస్తోంది.
ఓపెనర్లుగా భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, కివీ ప్లేయర్ డేవాన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. మొయిన్ అలీ దూరం కావడంతో మూడో స్థానంలో రాబిన్ ఊతప్ప వచ్చే అవకాశం ఉంది. అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని, శివమ్ దూబేతో మిడిలార్డర్ దృడంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. చహర్ స్థానాన్ని భారత యువ బౌలర్ రాజవర్ధన్ హంగర్కర్ భర్తీ చేసే అవకాశం ఉంది. క్రిస్ జోర్డాన్ లేదంటే మహీశ్ తీక్షణ తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
కేకేఆర్ విషయానికొస్తే.. వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే కేకేఆర్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో కెప్టెన్ అయ్యర్ లేదా నితీశ్ రాణా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక మిడిలార్డర్లో సామ్ బిల్లింగ్స్ రసెల్, నబీ, సునిల్ రైన్ హిట్టర్లు ఉండడం కేకేఆర్‌కు కలిసొచ్చే ఆంశం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శిమ్ మావి ఉమేశ్ యాదవ్ వరుణ్ చక్రవర్తి లతో కేకేఆర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు కావడం విశేషం.
Related News By Category
Related News By Tags
-
దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన
దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్‌కు పూర్తిగా దూరమైనట్లు సీఎస్కే శుక్రవారం ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ''మిస్ యూ దీపక్ చహర్.. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం'' అంటూ క్యాప్షన్ జత చే...
-
ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు
ధోని పని అయిపోయింది అంతా భావిస్తున్న వేళ దనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని తర్వాతి మ్యాచ్‌లోనే తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 2 పరుగులు చేయడానికి 10 బంతులు తీసు...
-
రనౌట్ విషయంలో రాయుడు చెత్త రికార్డు
సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు రనౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్‌లో జడేజా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇంతలో సమన్వయలోపంతో రాయుడు సగం క్రీజు దాటి వచ...
-
వారెవ్వా షెల్డన్ జాక్సన్.. ఏమా మెరుపు వేగం
సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ సూపర్ స్టంపింగ్‌తో మెరిశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాయుడు, ఊతప్పలు ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. వరుణ్ చక్రవ...
-
ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి మూడు రోజుల ముందు క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు 25 శాతం ప్రేక్షకులకు అనుమతినిస్తూ ఐపీఎల్ తన అధికారిక వెబ్సైట్లో బుధవారం పేర్కొంద...
Comments
Please login to add a commentAdd a comment