IPL 2022 Auction: Do You Know Ambati Rayudu And Hanuma Vihari Base Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ సందడి మొదలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే మెగా వేలం జరుగనున్న విషయం విదితమే. ఈ క్రమంలో జనవరి 22న మొత్తం 1,214 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల సూచనల ప్రకారం దీనిని కుదించి మంగళవారం బీసీసీఐ తుది జాబితాను ప్రకటించింది. ఫలితంగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య 590గా ఖరారైంది. ఇందులో భారత క్రికెటర్లు 370 మంది ఉండగా, విదేశీ ఆటగాళ్లు 220 మంది ఉన్నారు.
విదేశీ ఆటగాళ్లలో గరిష్టంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది వేలం బరిలో నిలిచారు. 590 మందిలో 228 మంది ఆయా దేశాల తరఫున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడగా... 355 మంది ‘అన్‌క్యాప్డ్’ ఆటగాళ్లు, మరో 7 మంది అసోసియేట్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఐపీఎల్‌లో పాల్గొనే ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఉంటారు. వేలానికి ముందు ఎనిమిది జట్లు 27 మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకోగా... రెండు కొత్త టీమ్‌లు మరో 6 మందిని ఎంచుకున్నాయి. మొత్తంగా ఈ 33 మంది ని తగ్గిస్తే... 217 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
భారీ డిమాండ్ ఖాయం...
రూ. 2 కోట్ల కనీస విలువతో 48 మంది ఐపీఎల్ వేలంలోకి అడుగు పెడుతుండగా, రూ. 1.5 కోట్ల జాబితాలో 20 మంది, రూ. 1 కోటి కనీస ధరతో 34 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న ‘మెగా వేలం’ కావడం, రెండు కొత్త జట్లు రావడంతో స్టార్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఖాయం. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, కమిన్స్ (ఆస్ట్రేలియా), డి కాక్, రబడ, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), శ్రేయస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, షమీ (భారత్), బెయిర్‌స్టో (ఇంగ్లండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్) వంటి ప్లేయర్లను అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి.
వేలంలో వీరికి రికార్డు ధర పలకవచ్చు. ఫ్రాంచైజీలు వద్దనుకున్న భారత ఆటగాళ్లు భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, రహానే, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, చహల్, శార్దుల్ ఠాకూర్ లపై కూడా అందరి కన్నూ ఉంది. అంబటి రాయుడు రూ. 2 కోట్ల కనీస విలువతో ఆసక్తికరంగా తన పేరును వికెట్ కీపర్ జాబితాలో నమోదు చేసుకోవడం విశేషం! హనుమ విహారి రూ. 50 లక్షల కనీస విలువతో బరిలో ఉన్నాడు.
చదవండి: IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా..
Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా
🚨 NEWS 🚨: IPL 2022 Player Auction list announced
— IndianPremierLeague (@IPL) February 1, 2022
The Player Auction list is out with a total of 590 cricketers set to go under the hammer during the two-day mega auction which will take place in Bengaluru on February 12 and 13, 2022.
More Details 🔽https://t.co/z09GQJoJhW pic.twitter.com/02Miv7fdDJ
Comments
Please login to add a commentAdd a comment