Cricketer Ambati Rayudu Meets AP CM YS Jagan Mohan Reddy In Tadepalli - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

Jun 8 2023 4:53 PM | Updated on Jun 15 2023 1:43 PM

Ambati Rayudu Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్‌ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు.

ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్‌కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

ఐపీఎల్‌లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్‌కే ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి రాయుడు ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. 

కాగా, రాయుడు.. సీఎం జగన్‌ కలవడం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు.- మిడుతూరి జాన్‌ పాల్‌, సాక్షి వెబ్‌ డెస్క్‌

చదవండి: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement