
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
పాలిటిక్స్.. నా సెకండ్ ఇన్నింగ్స్: రాయుడు
అనంతరం సాక్షి టీవీతో క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ..రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు.
తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కాగా గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత
Comments
Please login to add a commentAdd a comment