photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని దళం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, సూపర్ విక్టరీ సాధించింది. జడేజా అదిరిపోయే బౌలింగ్ పెర్ఫార్మెన్స్ (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో సీఎస్‌కేకు సునాయాస విజయాన్ని అందించారు.
వీరితో పాటు జట్టులోని అందరూ తలో చేయి వేయడంతో సీఎస్‌కే కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. తద్వారా 8 పాయింట్లు (0.355) ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
Deceived and How!
— IndianPremierLeague (@IPL) April 21, 2023
A beaut of a delivery THAT by Mayank Markande 🔥
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/bgvGctoeCN
ఇన్ని సానుకూల అంశాల నడుమ సీఎస్‌కేను ఒక్క విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అదే, ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఫామ్ లేమి. ప్రస్తుత సీజన్‌లో రాయుడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. లక్నో (27 నాటౌట్), ముంబై (20 నాటౌట్)లపై ఓ మోస్తరు ప్రదర్శనలు మినహాయించి, మిగతా 4 మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు.
ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్న అతనికి, అతని కెప్టెన్ ధోనికి ఈ విషయం అస్సలు సహించడం లేదని సమాచారం. మరి ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయుడు ఔటైన విధానం, కెప్టెన్‌తో పాటు ఫ్యాన్స్‌కు సైతం విస్మయాన్ని కలిగించింది. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో బంతిని జడ్జ్ చేయడంలో విఫలమైన రాయుడు (9).. చాలా చీప్‌గా క్లీన్ బౌల్డయ్యాడు. రాయుడు చీప్ డిస్మిసల్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమయ్యా రాయుడు.. మరీ ఇంత చీప్‌గా బౌల్డ్ అయిపోతివి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment