Mayank Markande
-
CSK VS SRH: మార్కండే సూపర్ డెలివరీ..అయ్యో ఎంత పని జరిగిపోయింది!
ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని దళం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, సూపర్ విక్టరీ సాధించింది. జడేజా అదిరిపోయే బౌలింగ్ పెర్ఫార్మెన్స్ (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో సీఎస్కేకు సునాయాస విజయాన్ని అందించారు. వీరితో పాటు జట్టులోని అందరూ తలో చేయి వేయడంతో సీఎస్కే కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. తద్వారా 8 పాయింట్లు (0.355) ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. Deceived and How! A beaut of a delivery THAT by Mayank Markande 🔥 Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/bgvGctoeCN — IndianPremierLeague (@IPL) April 21, 2023 ఇన్ని సానుకూల అంశాల నడుమ సీఎస్కేను ఒక్క విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అదే, ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఫామ్ లేమి. ప్రస్తుత సీజన్లో రాయుడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. లక్నో (27 నాటౌట్), ముంబై (20 నాటౌట్)లపై ఓ మోస్తరు ప్రదర్శనలు మినహాయించి, మిగతా 4 మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్న అతనికి, అతని కెప్టెన్ ధోనికి ఈ విషయం అస్సలు సహించడం లేదని సమాచారం. మరి ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయుడు ఔటైన విధానం, కెప్టెన్‌తో పాటు ఫ్యాన్స్‌కు సైతం విస్మయాన్ని కలిగించింది. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో బంతిని జడ్జ్ చేయడంలో విఫలమైన రాయుడు (9).. చాలా చీప్‌గా క్లీన్ బౌల్డయ్యాడు. రాయుడు చీప్ డిస్మిసల్పై సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమయ్యా రాయుడు.. మరీ ఇంత చీప్‌గా బౌల్డ్ అయిపోతివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ధావన్‌కు విశ్రాంతి.. మార్కండే అరంగేట్రం
విశాఖ: రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. కాగా, యువ క్రికెటర్ మయాంక్ మార్కండే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను పక్కకు పెట్టిన టీమిండియా యాజమాన్యం.. లెగ్ బ్రేక్ బౌలర్ మార్కండేను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఆపై న్యూజిలాండ్‌తో జరిగిన పొట్టి ఫార్మాట్లో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. కాగా, ఈ సిరీస్‌ను ఇరు జట్లు వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనబడుతోంది. భారత్ తుది జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, మయాంక్ మార్కండే, యజ్వేంద్ర చహల్, బుమ్రా ఆసీస్ తుది జట్టు అరోన్ ఫించ్(కెప్టెన్), డీఆర్సీ షార్ట్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హ్యాండ్ స్కాంబ్, ఆస్టన్ టర్నర్, కౌల్టర్ నైల్, ప్యాట్ కమిన్స్, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్, ఆడమ్ జంపా -
ఎవరీ యువ కెరటం..
పాటియాలా: త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్ ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో మరో యువ స్పిన్నర్ చేరాడు. పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. ఆసీస్‌తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మార్కండేకు జట్టులో చోటు కల్పించారు. తన లెగ్ బ్రేక్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న మయాంక్‌ను ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గొనబోయే భారత జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన మయాంక్ మార్కండే 2013-14 సీజన్లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో 18.24 సగటుతో మొత్తం 29 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-16 జట్టు తరుపున కేవలం 7 మ్యాచ్‌ల్లోనే మార్కండే ఈ వికెట్లను పడగొట్టడం విశేషం. మరొకవైపు 2015-16 సీజన్లో కూచ్ బెహార్ ట్రోఫీలో 25 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన మయాంక్ మార్కండే.. 2016-17 సీజన్లో 35 వికెట్లు సాధించి మరొకసారి టాప్‌లో నిలిచాడు. 2017-18 సీజన్లో పంజాబ్ తరుపున లిస్ట్-ఏ క్రికెట్లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడిన మార్కండే మొత్తం 20 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టిన మయాంక్.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు 7 ఫస్టక్లాస్ మ్యాచ్ లాడిన మార్కండే ఇప్పటివరకు 34 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల మార్కును చేరడం మరో విశేషం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మయాంక్ మొత్తం 14 మ్యాచ్‌లాడి 15 వికెట్లు తీశాడు. ముంబైతో అరంగేట్రం మ్యాచ్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లను మయాంక్ సాధించాడు. ఇందులో అంబటి రాయుడు, ధోని వికెట్లు ఉండటం గమనార్హం. మయాంక్ వేసిన గూగ్లీకి రాయుడు, ధోనిలు ఎల్బీగా పెవిలియన్ చేరారు. . తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో మయాంక్ మార్కండే ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మార్కండే తన కెరీర్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు. అతన్ని పేసర్‌గా చూడాలన్నది తండ్రి బిక్రమ్ సింగ్ కోరిక. అయితే శిక్షణ కొరకు పాటియాలాలోని ఎన్సీఎస్ అకాడమీలో చేరినప్పడు అక్కడ కోచ్ మహేష్ ఇందర్ సింగ్ సూచన మేరకు లెగ్ స్పిన్నర్‌గా మారాడు. లెగ్ స్పిన్‌లో మార్కండే వెపన్ ఏంటంటే గూగ్లీ. గతేడాది ఫిబ్రవరి 7న విజయ్ హాజారే టోర్నీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-ఎ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన మయాంక్ 37 పరుగులిచ్చి రెండు వికెట్లతో సాధించాడు. గత ఏడేళ్లుగా భారత అండర్-19 మాజీ కోచ్ మనీష్ బాలీ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు ఈ యువ కెరటం. తాను లెగ్ స్పిన్నర్‌గా మారడానికి అనిల్ కుంబ్లే, షేన్ వార్న్‌లే కారణమంటున్నాడు మార్కండే. -
మార్కండే స్పిన్‌కు లయన్స్ విలవిల
మైసూర్: లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (5/31) మణికట్టు మాయాజాలానికి ఇంగ్లండ్ లయన్స్ తోక ముడిచింది. రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మరో రోజు మిగిలుండగానే భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 24/0తో ఫాలోఆన్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 53.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో లయన్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఓపెనర్ బెన్ డకెట్ (50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా, లోయర్ మిడిలార్డర్లో లూయిస్ గ్రెగరీ (44; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ బిల్లింగ్స్ 20 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 40 పరుగుల వద్ద జలజ్ సక్సేనా బౌలింగ్‌లో హోల్డన్ (7) వికెట్‌తో మొదలైన పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. 140/5 స్కోరుతో ఉన్న లయన్స్ జట్టు... మార్కండే మాయాజాలం మొదలుకాగానే 40 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. జలజ్ సక్సేనా 2, నవదీప్ సైని, షాబాజ్ నదీమ్, వరుణ్ అరోన్ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లోని భారత్ ‘ఎ’... లయన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌట్ చేసింది. -
యువ లెగ్ స్పిన్నర్‌కు భలే ఛాన్స్..!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఓ కొత్త కుర్రాడు చేరాడు. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకి ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ శుక్రవారం ఇండియన్ టీమ్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. జూనియర్ స్థాయి నుంచే మార్కండే బౌలింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. (ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే..) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఅడుగుపెట్టిన ఏడాదే హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 31 పరుగులకు 5 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మే చివరి వారంలో వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవనున్న నేపథ్యంలో కొత్తవాళ్లను తీసుకోకపోవచ్చని క్రికెట్ పండితులు భావించారు. కానీ మార్కండే వంటి టాలెంటెడ్ కుర్రాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ తాజా నిర్ణయంద్వారా తెలియపరిచింది. టీమిండియాలో స్థానం సంపాదించడం పట్ల మార్కండే హర్షం వ్యక్తం చేశాడు. తన కల నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇంత త్వరగా టీమిండియాలో స్థానం లభిస్తుందని అనుకోలేదని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. -
దిగ్గజాల మదిని గెలుస్తున్న మయాంక్
-
ఐపీఎల్లో మెరిసిన లోకల్ స్టార్స్
-
స్పిన్ సంచలనం అరుదైన రికార్డులు
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ 11లో సంచలన బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఒకరు. ఈ సీజన్లో ఆడింది కేవలం రెండంటే రెండు మ్యాచ్‌లే. కానీ అతడు ప్రత్యర్థులకు సంధించిన బంతులు చూస్తే మాత్రం ఎంతో అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో మ్యాచ్‌లో మయాంక్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో ముంబై ఇండియన్స్ కు విజయం నల్లేరుపై నడక అన్నట్లుగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన మయాంక.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా నాలుగు వికెట్లు (4/23) తీసి అరుదైన రికార్డులు నమోదు చేశాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన మార్కండే అతిపిన్న వయసు (20 ఏళ్ల 152 రోజులు)లో ఈ ఫీట్ నెలకొల్పిన మూడో ఆటగాడిగా నిలిచాడు. దాంతో పాటు 2016 ఐపీఎల్ నుంచి ఓ జట్టు టాపార్డర్ 5 వికెట్లలో 4 వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా మార్కండే గుర్తింపు సాధించాడు. గూగ్లీలతో టాప్ బ్యాట్స్మెన్లను ఉక్కిరి బిక్కిరి చేసి సన్‌రైజర్స్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఏడు వికెట్లు తీసిన ముంబై బౌలర్ మార్కండే పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నాడు. మరొకవైపు రెండు మ్యాచ్‌ల తర్వాత మార్కండే 6.57 బౌలింగ్ సగటుతో కొనసాగడం విశేషం. అదే సమయంలో అతి ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో మార్కండే ఒకరు. 45.83 శాతం బంతులను డాట్ బాల్స్‌గా వేయడం గమనార్హం.