వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు హైదారాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్‌లో చెలరేగడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు.
గత రెండు ఐపీఎల్ సీజన్‌లలో కూడా తిలక్ వర్మ అద్బుతమైన ప్రదర్శరన కనబరిచాడు. గతేడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన తిలక్.. 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున రెండో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో కూడా అతడు అదరగొట్టాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు.
ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన తిలక్ వర్మకు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభినందనలు తెలిపాడు. "భారత జట్టుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ ఫార్మాట్‌లో టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తావని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్ తిలక్" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.
అదే విధంగా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ఎంపికపై స్పందిచాడు. "తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికైనందుకు అభినందనలు. తిలక్ జట్టులోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా" అని సూర్య ట్విటర్‌లో పేర్కొన్నాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
Hearty congratulations @TilakV9 on being picked for the Indian team.. I am sure you will have a super career in every format for India.. wishing you all the very best..
— ATR (@RayuduAmbati) July 6, 2023
చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment