టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో దుమ్ము రేపిన తిలక్.. గయనా వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా అదే తరహా ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు
ఇక హాఫ్ సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. వర్మ ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను తిలక్ అధిగమించాడు. పంత్ 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి స్ధానంలో ఉన్నాడు. రోహిత్ ఈ అరుదైన ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో నమోదు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమి చవి చూసింది. గయనా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. విండీస్ బ్యాటర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
చదవండి: గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ కోసం భారత్‌కు పాక్
Maiden half-century for Tilak Varma in the second match of his T20I career! 🔥
— OneCricket (@OneCricketApp) August 6, 2023
A promising talent for India👏#TilakVarma #TeamIndia #CricketTwitter pic.twitter.com/osLF2BMUwO
Comments
Please login to add a commentAdd a comment