కరేబియన్ గడ్డపై టీమిండియాకు మరో షాక్ తగిలింది. గయనా వేదికగా స్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం చవి చూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి అతిథ్య విండీస్ దూసుకువెళ్లింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
విండీస్ బౌలర్లలో అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, చహల్ రెండు, అర్ష్‌దీప్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఇక వరుసగా రెండో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిచాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
కొంచెం బాధ్యత తీసుకోవాలి
"ఈ మ్యాచ్‌లో మా స్ధాయికి తగ్గట్టు బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయాం. మేము ఇంతకన్న బాగా బ్యాటింగ్ చేయగలము. ఈ పిచ్‌పై 160 పైగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా పోటీ ఇచ్చే వాళ్లం. మాకు బౌలింగ్‌లో అద్భుతమైన ఆరంభం వచ్చింది. 2 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌పై ఒత్తిడి పెంచాము. కానీ పూరన్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఇది మేము అస్సలు ఊహించలేదు.
స్పిన్నర్లను రోటాట్ చేయడం చాలా కష్టం. పూరన్ స్పిన్నర్లనే టార్గెట్ చేశాడు. మేము ఈ మ్యాచ్‌లో 7 మంది బ్యాటర్లతో బరిలోకి దిగాము. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఆడాలి. అప్పుడే మనం విజయం సాధించగలం. మేము తదుపరి మ్యాచ్‌లో సరైన బ్యాలెన్స్‌తో బరిలోకి దిగుతాం. ఇక తిలక్ వర్మ గురించి ఎంత చెప్పిన తక్కువే.
నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. తిలక్‌కు ఇది రెండో అతర్జాతీయ మ్యాచ్‌గా నాకు అనిపించలేదు. అతడి బ్యాటింగ్ చూస్తే ఏదో వందో మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించింది పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో భారత ఆటగాడిగా! పంత్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment