
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక అఖిల భారత రంజీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. అంబటి రాయుడు ఈ సీజన్ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టు సారథ్యాన్ని తన్మయ్ అగర్వాల్‌కు అప్పగించారు. బావనక సందీప్ వైస్ కెప్టెన్ గా ఎంపికవగా, ఎన్. అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సొంతగడ్డపై జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ జట్టు ఆడుతుంది.
జట్టు వివరాలు
తన్మయ్ అగర్వాల్, పి. అక్షత్ రెడ్డి, కె. రోహిత్ రాయుడు, బి. సందీప్, హిమాలయ్ అగర్వాల్, కొల్లా సుమంత్, మెహదీహసన్, సాకేత్ సాయిరామ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, జీఏ శశిధర్ రెడ్డి, యుద్‌వీర్ సింగ్, జె. మల్లికార్జున్.
Comments
Please login to add a commentAdd a comment