క్రికెట్‌ కోసమే రాజకీయాలకు దూరం: అంబటి రాయుడు | Ambati Rayudu Will Be Representing Mumbai Indians In Upcoming ILT20 2024 | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ కోసమే రాజకీయాలకు దూరం: అంబటి రాయుడు

Published Sun, Jan 7 2024 5:19 PM | Last Updated on Mon, Jan 8 2024 9:22 AM

Ambati Rayudu Will Be Representing Mumbai Indians In Upcoming ILT20 2024 - Sakshi

టీమిండియా మాజీ క్రికెట్‌ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బ్యాట్‌ పట్టనున్నట్లు ప్రకటించాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు.

ఇంటర్నేషనల్‌ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement