హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. హెచ్‌సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్‌సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్‌గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్‌లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున‍్నానని పేర్కొన్నాడు.
దీనిపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు అసహనంతోనే ఆ వ్యాఖ్యలు చేశాడన్నారు. ఈ విషయంపై తిరిగి స్పందించిన రాయుడు.. ‘హాయ్ అజహర్. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్‌సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రికెటర్లను రక్షించినట్లవుతుంది’ అని తాజా పరిణామాలపై అజహర్‌కు రాయుడు సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment