IPL 2022: AP and Telangana Cricketers In IPL, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Published Sat, Mar 26 2022 9:18 AM | Last Updated on Sat, Mar 26 2022 12:25 PM

AP and Telangana Cricketers In Ipl 2022 - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022 సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం(మార్చి 26)న వాంఖడే వేదికగా కోల్‌కతా- చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. అయితే ఆ మెగా టోర్నమెంట్‌లో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సత్తా చాటడానికి సిద్దమమ్యారు. ఈ సారి ఐపీఎల్‌లో ఆయా జట్లకు ఆడుతున్న హైదరాబాద్, ఆంధ్ర జట్ల ఆటగాళ్లో ఎవరో ఓ లూక్కేద్దం. ఆంధ్ర జట్టు నుంచి  అంబటి రాయుడు, భగత్‌ వర్మ,  కోన శ్రీకర్‌ భరత్‌..  హైదరాబాద్ జట్టు నుంచి  సీవీ మిలింద్, మొహమ్మద్‌ సిరాజ్‌, రాహుల్‌ బుద్ధి, ఠాకూర్‌ తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో భాగమయ్యారు. 

ఐపీఎల్‌-2022లో అంబటి రాయుడు, భగత్‌ వర్మ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతనిద్యం వహిస్తుండగా.. కోన శ్రీకర్‌ భరత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్నాడు. అదే విధంగా సీవీ మిలింద్, మొహమ్మద్‌ సిరాజ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడుతుండగా.. రాహుల్‌ బుద్ధి, ఠాకూర్‌ తిలక్‌ వర్మ ముంబై ఇండియన్స్‌ జట్టులో భాగమయ్యారు.

చదవండి: IPL 2022: "మా నాన్నని నేను చాలా మిస్ అవుతున్నా".. ఐపీఎల్‌ ముంగిట పంత్ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement