దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబైతో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అంబటి రాయుడు చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. లక్ష్యచేదనలో ఏమాత్రం తడబడకుండా తనదైన శైలిలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాయుడు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొని 6ఫోర్లు, 4 సిక్సర్లతో 71పరుగులతో ఆకట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రైనా లేని లోటును భర్తీ చేస్తూ దాటిగా ఆడిన రాయుడు ఇన్నింగ్స్ ఆసాంతం కసిగా ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రాయుడు తన ఇన్నింగ్స్‌పై స్పందించాడు. (చదవండి : రాయుడో రాయుడా... )
'ఐపీఎల్ ప్రారంభానికి చాలా రోజుల ముందే మా జట్టు చెన్నైలో ప్రాక్టీస్ ఆరంభించింది. తర్వాత లాక్‌డౌన్‌లోనూ నా ప్రాక్టీస్ నిరంతరాయంగా కొనసాగింది. ఈ రెండింటి దగ్గర చేసిన ప్రాక్టీస్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణం అదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దాటిగా ఆడాలని ముందు అనుకోలేదు.. పిచ్ పరిస్థితి ఏంటనేది అంచనా వేసుకున్నాక బ్యాట్ ఝూలిపించాను. మొదట ఒక పది బంతులను సమర్థంగా ఎదుర్కొన్న తర్వాత పిచ్‌ను అనుకూలంగా మార్చుకున్న తర్వాత పరుగులు వాటంతట అవే వచ్చాయి. రైనా లేని లోటును పూడ్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వన్‌డౌన్‌లో వచ్చి బ్యాటింగ్ చేశా.' అంటూ అంబటి రాయుడు తెలిపాడు
ఎమ్మెస్కేపై అభిమానుల ట్రోలింగ్
2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని సెలక్ట్ చేయకపోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఆపై విజయ్ శంకర్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అని అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడం తెలిసిందే. ఈ అంశం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీంతో రాయుడు మనస్తాపానికి లోనై అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. (చదవండి : ఫ్యాన్స్ లేరు.. స్టేడియం మాత్రం గోలగోల)
అయితే ఇది తొందరపాటు చర్యగా భావించి రాయుడు మళ్లీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. రాయుడికి వరల్డ్ కప్ ఛాన్స్ రాకపోవడం, మరోవైపు అతడి స్థానంలో తీసుకున్న విజయ్ శంకర్ ఆ ఈవెంట్‌లో విఫలం కావడం క్రికెట్ అభిమానులను కలచివేసింది. తాజాగా చెన్నై గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో, రైనా లేని లోటును సైతం భర్తీ చేస్తూ సీఎస్కేను డిఫెండింగ్ చాంపియన్ ముంబైను ఓడించే ఇన్నింగ్ ఆడడంతో క్రికెట్ ప్రేమికులు ప్రసాద్‌పై విపరీతమైన ట్రోల్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment