రాయుడు అరుదైన రికార్డు.. బుమ్రా చెత్త రికార్డు | IPL 2021: Rayudu Was 4th CSK Batsman For Fastest Half Century Vs MI | Sakshi
Sakshi News home page

రాయుడు అరుదైన రికార్డు.. బుమ్రా చెత్త రికార్డు

Published Sat, May 1 2021 10:26 PM | Last Updated on Sun, May 2 2021 2:06 AM

IPL 2021: Rayudu Was 4th CSK Batsman For Fastest Half Century Vs MI - Sakshi

courtesy : IPL Twitter

ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అంబటి రాయుడు సిక్సర్ల వర్షం కురిపించాడు. 27 బంతుల్లోనే 4 ఫోర్లు.. 7 సిక్సర్లతో 72 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి సీఎస్‌కే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో రాయుడు అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రాయుడు నిలిచాడు. 20 బంతుల్లో రాయుడు ఫిఫ్టీ మార్క్‌ను చేరుకొని మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా సీఎస్‌కే తరపున సురేశ్‌ రైనా(2014) 16 బంతుల్లో అర్థశతకం సాధించి తొలి స్థానంలో ఉండగా.. ధోని(2012) 20 బంతుల్లో అర్థశత‍కం అందుకోగా .. తాజాగా రాయుడు కూడా 20 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకొని ధోనితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక సామ్‌ బిల్లింగ్స్‌(2018) 21 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక ఇదే మ్యాచ్‌లో బుమ్రా ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో బుమ్రా 40 కంటే ఎక్కవ పరుగులు ఇవ్వడం ఇది నాలుగోసారి. 2017లో గుజరాత్‌ లయన్స్‌ మ్యాచ్‌లో 45 పరుగులు, 2015లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 52, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో 55.. తాజాగా 2021లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో 56 పరుగులు ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేశాడు.
చదవండి: సురేశ్‌ రైనా అరుదైన ఘనత

ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు: ధోని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement