
న్యూఢిల్లీ: తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచిన వారికి తెలుగు తేజం అంబటి రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు.. మళ్లీ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనకు మద్దతుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మేనేజ్‌మెంట్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.
దీనిలో భాగంగా హెచ్‌సీఏకు లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకున్నదేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. తనవరకూ చూస్తే ఆడాల్సిన క్రికెట్ చాలా ఉందంటూ తెలిపాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. హెచ్‌సీఏ నిర్వహించే వన్డే, టి20 క్రికెట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment