
నల్లధనం దేశ భద్రతకు సవాల్: మోదీ
నల్లధనం దేశ భద్రతకు సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బ్రిస్బేన్: నల్లధనం దేశ భద్రతకు సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు దేశాధినేతల బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగించారు. నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడానికి సమన్వయ సహకారం అవసరమని మోదీ అన్నారు. శనివారం బ్రిస్బేన్ లో జరిగే జీ 20 సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు.