ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అభయ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌జీకార్ ఘటన తనని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదు.. చాలు’అని సూచించారు.
నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. సమాజం వాటిని మర్చిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైందని అన్నారు.
ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో నర్సులపై అఘాయిత్యాలు, మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాలపై రాష్ట్రపతి ముర్ము పరోక్షంగా స్పందించారు. కోల్‌కతా అభయ కేసులో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు చేస్తున్నప్పటికీ నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment