ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని విచారం | Bus Overturned Accident At Chhattisgarh Durg District | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి, 14 మంది పరిస్థితి విషమం​

Published Wed, Apr 10 2024 7:36 AM | Last Updated on Wed, Apr 10 2024 8:00 AM

Bus Overturned Accident At Chhattisgarh Durg District - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ‍రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భారీ గుంతలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తాపడింది. కాగా,  ఓ డిస్టిలర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక, రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు.

మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇక, ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుర్గ్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement