ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌ | Economic Survey 2025: Droupadi Murmu Declared That India Metro Rail Network Has Now Surpassed The 1000 Kilometre Milestone | Sakshi
Sakshi News home page

Economic Survey 2025: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌

Published Fri, Jan 31 2025 12:38 PM | Last Updated on Fri, Jan 31 2025 1:49 PM

Droupadi Murmu declared that India metro rail network has now surpassed the 1000 kilometre milestone

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే(Union Budget Economic Survey 2025) 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. భారతదేశ మెట్రో రైలు నెట్‌వర్క్‌ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. దాంతో చైనా, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో ఈ విజయం సాధించిన మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్‌ నిలిచింది.

భారతదేశం మెట్రో రైలు నెట్‌వర్క్‌ 1,000 కిలోమీటర్లకు చేరడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణ పట్టణ రవాణాను పెంచడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి వీలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసే ప్రణాళికలతో మెట్రో, రాపిడ్ రైల్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించింది.

ఇదీ చదవండి: మిషన్ మౌసమ్‌తో వాతావరణ సమాచారం

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రయాత్నాల్లో భాగంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ముర్ము ప్రస్తావించారు. 272 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్లిష్టమైన భూభాగం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. అయినా దీన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని, వస్తువులు, ప్రయాణీకుల రవాణా మెరుగవుతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement