న్యూఢిల్లీ: లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ప్రొటెం స్పీకర్ తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు.
కాగా భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. తొలుత బీజేడీ నుంచి పోటీ చేసిన ఆయన.. ఇటీవల ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. బీజేడీ అభ్యర్థి సంత్రుప్ట్ మిశ్రాపై విజయం సాధించారు. ఒడిశా మొదటి ముఖ్యమంత్రి హరేక్రుష్ణ మహతాబ్ కుమారుడే మహతాబ్, 2024లో కటక్‌లో మళ్లీ గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment