మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment