భారత రాష్ట్రపతిగా ఆ అత్యున్నత పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. అంతేగాదు ఈ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ కూడా ఆవిడే కావడం విశేషం. రాష్ట్రపతిగా అనునిత్యం బిజీగా ఉండే ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆమె డైట్ ఎలా ఉంటుందనే కుతుహలం ఉంటుంది. అయితే ఆమె ఏం డైట్ ఫాలో అవ్వుతారో రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు వెల్లడించడమేగాక పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే..
ద్రౌపది ముర్ము సాత్విక ఆహారాన్నే ఇష్టపడతారని, ప్రధానంగా శాకాహారమే ఇష్టంగా తింటారని రాష్ట్రపతి భవన్ చెఫ్‌లు పేర్కొన్నారు. ఆమె 2022లో షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేగాదు ఆమె తన తెగకు చెందిన ప్రజల గొంతుకగా మారి వారి సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల ఆదరాభిమానలను పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముర్ము తను తీసుకునే ఆహారం విషయంలో సాత్వికాహారానికే పెద్దపీట వేస్తారని చెఫ్‌లు చెబుతున్నారు.
ముఖ్యంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి బొప్పాయితో చేసే వంటకాన్ని కచ్చితంగా చేయాల్సిందేనని అన్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా వండిన భోజనాన్నే తినడానికి ఇష్టపడతారట ఆమె. ఇక ఆమె ఓట్స్, సంప్రదాయ పూరీ ఆలు సబ్జీ కలియకతో కూడిన అల్పాహారంతో రోజుని ప్రారంభిస్తారని సీనియర్ కుక్ చెఫ్ సంజయ్ కుమార్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో రైస్ చిల్లాస్ ఒకటని అన్నారు.
తరచుగా ఆమె ఒడియా వంటకాలనే ఇష్టపడతారని తెలిపారు. 2000 నుంచి 2009 వరకు రాయ్‌రంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో ఆ రాష్ట్రంతో ఆమెకున్న విడదీయరాని అనుబంధం అమె అభిరుచిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. అందువల్లే ఆమె భోజనంలో ఒడియా వంటకాలైన దాల్మా, సంతులా వంటకాలు కచ్చితంగా ఉంటాయని చెప్పారు.
దాల్మా అనే వంటకం చిక్‌పీస్, మునగకాయలు, బొప్పాయి వంటి కూరగాయాలతో కూడిన ఆహారం. ఇక సంతులా అంటే కాలానుగుణ కూరగాయాలతో చేసే మిశ్రమ వంటకం. ఈ రెండు సాత్వికాహారానికి చెందినవేనని చెబుతున్నారు చెఫ్‌లు. ఆమె కాలానుగుణ కూరగాయాలకు, పండ్లకు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే ఈ సాత్వికాహార డైట్ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
సాత్వికాహారంతో ఒనగురే ప్రయోజనాలు..
- మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ
- శరీరానికి అవసరమయ్యే శక్తి స్థాయిలు అందిస్తుంది
- మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది.
- ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది.
- దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది
- బరువుని అదుపులో ఉంచుతుంది
- సుదీర్ఘ ఆయుర్ధాయం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment