భారత రాష్ట్రపతి ఆకాంక్ష
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో ఆమె మన ఆటగాళ్లు ఎక్కువ పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ‘ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో భారత యువ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు పోటీల్లో రికార్డు సంఖ్యలో పతకాలు గెలుస్తున్నారు.
కొద్ది రోజుల్లో పారిస్‌లో ఒలింపిక్స్‌లో ప్రారంభం కానున్నాయి. అందులో పాల్గొనే ప్రతీ భారత అథ్లెట్‌లను చూసి మేం గర్విస్తున్నాం. వారికి నా అభినందనలు’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మరోవైపు 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేసే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
మన ఘనతలను మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో భారత ఒలింపిక్ సంఘం 2036 ఒలింపిక్స్ కోసం బిడ్ వేసేందుకు సిద్ధమవుతోందని ముర్ము అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జరిగే బిడ్‌లో ఖతర్, సౌదీ అరేబియా, ఇండోనేసియా లాంటి దేశాలతో భారత్ పోటీ పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment