
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో గొడవకు దిగాడు. దీంతో, ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి తిరుమలలో హల్‌చల్ చేశాడు. నేను లోకల్ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
