
తిరుపతి, సాక్షి: జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్ లారీని కారు వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.