శ్రీవారికి రెండు అంబులెన్స్‌లు గిఫ్ట్ | Two ambulances gift to TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రెండు అంబులెన్స్‌లు గిఫ్ట్

Published Sun, Nov 29 2015 8:36 PM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

Two ambulances gift to TTD

తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆదివారం రూ.30 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లు వితరణగా అందాయి. కోల్‌కతాకు చెందిన ప్రకాష్ చౌదరి వీటిని బహూకరించారు. శ్రీవారి ఆలయంలో రెండు దశాబ్దాలకు పైగా పోటు విధులు నిర్వహించి, ఇటీవల గుండెపోటుతో మతిచెందిన రమేష్ జ్ఞాపకార్థం వీటిని కానుకగా ఇచ్చినట్టు ప్రకాష్ చౌదరి తెలిపారు. అంబులెన్స్ తాళాలను జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు,  ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డికి అందజేశారు.


కాగా.. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనీల్ సిన్హా కు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement