తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 65,842మంది దర్శించుకోగా.. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది. 28,585 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.