అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కన్నన్
తిరుమల ఆర్టీసీ బస్టాండు వద్ద సోమవారం మతిస్థిమితం లేని ఓ సైకో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన అక్కర్చికుప్పానికి చెందిన కన్నన్ (38) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
సాక్షి, తిరుమల:
తిరుమల ఆర్టీసీ బస్టాండు వద్ద సోమవారం మతిస్థిమితం లేని ఓ సైకో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన అక్కర్చికుప్పానికి చెందిన కన్నన్ (38) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మ«ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరుగుప్రయాణమయ్యారు. ఇక్కడి బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో కన్నన్ తలకు గాయమైంది. అతన్ని స్థానికులు అశ్విని ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అక్కడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడని, పూర్తి వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నాడని టూ టౌన్ ఎస్‌ఐ వెంకట్రమణ తెలిపారు. అలాంటి వ్యక్తులపై నిఘా ఉంచి , తిరుమలలో లేకుండా ఏరివేస్తామని ఎస్‌ఐ తెలిపారు.