నేత్రపర్వం..కడపరాయుడి కల్యాణం | marriage | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం..కడపరాయుడి కల్యాణం

Published Thu, Feb 19 2015 2:53 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

marriage

కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి క ల్యాణం బుధవారం ఆలయ ముఖ మండపంలో వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు చేసి  అలంకరించి ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు.
 
 కల్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. అమ్మవారి మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి అర్చకులే స్వామి పక్షాన అమ్మవారికి అలంకరించారు. స్థానిక భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 రూ. 7 లక్షల ఆదాయం..
 దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం హుండీలను బుధవారం  లెక్కించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు హుండీల ద్వారా రూ. 7,34,540 లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ కార్యాలయ సూపరింటెండెంట్ నీలాద్రి, విజిలెన్స్ అధికారులు, ఆలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement