
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే
శ్రీలంక ప్రధాన మంత్రి ఎండీ.జయరత్నే శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
శ్రీలంక ప్రధాన మంత్రి ఎండీ.జయరత్నే శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 8.30 గంటలకు తిరుమలకు వచ్చారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికారు. జయరత్నే ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు జయరత్నేకు ఆశీర్వచనం చేశారు. - సాక్షి, తిరుమల