శ్రీవారి సేవలో తరించిన హైందవేతరులు
సనాతన హైందవ క్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హిందువులతోపాటు హైందవేతరులు కూడా సేవించి తరించారు. వారు నిర్దేశించిన వాటిలో చాలావరకు టీటీడీ కూడా అనుసరిస్తూ భక్తులకు విశిష్ట సేవలు అందిస్తోంది.
శ్రీవారి ఆలయంలో మన్రో గంగాళం
♦ మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్ థామస్ మన్రో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతని కార్యదర్శుల్లో ఒకరు తిరుమలేశునికి మొక్కుకోమని సలహా ఇచ్చారు. ఆ సలహాను స్వీకరించటంతోనే మన్రో కడుపునొప్పి తగ్గింది
♦ మొక్కుని తీర్చుకునేందుకు ప్రతిరోజూ ఒక గంగాళానికి సరిపడా మిరియాల పొంగలిని భక్తులకు ప్రసాదంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన్రో. అందుకోసం మన్రోగంగాళం పేరుతో, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు తాలూకా, కోటబయలు అనే గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించేలా ఒక శాశ్వత నిధి ఏర్పాటు చేశారు
♦ ఆ నిధితో ఏర్పాటు చేసిన ప్రసాదాల పంపిణీ వ్యవస్థ తిరుమల ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా అమలవుతోంది.
వెంకన్నపై లార్డ్ విలియమ్స్ భక్తి విశ్వాసాలు
♦ బ్రిటిష్‌ప్రభుత్వంలోని ఉన్నతాధికారి లార్డ్ విలియమ్స్ దీర్ఘకాలిక రోగంతో బాధపడేవాడట. తనకు నయమైతే శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తానని మొక్కుకొనమన్న ఓ హిందూ అధికారి సూచన మేరకు విలియమ్స్ స్వామివారికి దణ్ణం పెట్టుకున్నాడట. ఆ వ్యాధి ఆ రోజు నుండి క్రమంగా నయమైంది
♦ దాంతో లార్డ్ విలియమ్స్ ‘చలిపండిలి’ పేరుతో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే కాలిబాటలోని తొలిమైలులో (నేరేడు మాకుల ప్రాంతం) చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కాలినడకలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చింది
♦ ఈ సేవను ఇప్పటికీ టీటీడీ కొనసాగిస్తోంది
♦ షేక్ హుస్సేన్ అనే భక్తుడు తన తాత, తండ్రుల సంకల్పం మేరకు స్వామివారికి ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు కలిగిన 108 బంగారుపూలను బహూకరించారు. ప్రతి మంగళవారం గర్భాలయ మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఈ బంగారు పుష్పాలే వాడతారు
♦ స్వామి సన్నిధిలో బీబీ నాంచారమ్మ అనే మహ్మదీయ భక్తురాలు సేవ చేసినట్టు చరిత్ర. ఈమె భక్తి పారవశ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొగలు చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ చిత్రాలు ఉన్న 500 నాణేలతో ఉన్న దండను శ్రీవారికి సమర్పించారు
♦ కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో మరో హారాన్ని తయారు చేశారు. 1972కు ముందు ఈ హారాలనే వినియోగించేవారు నాదస్వర చక్రవర్తి షేక్ చినమౌలానా
♦ నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. ఆయన ఏకైక కుమార్తె వీవీ జాన్ కుమారులు షేక్ ఖాసీం, షేక్ బాబు తిరుమలేశుని ఆలయం నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు.